- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సీనియర్ నేత మృతి.. సంతాపం తెలిపిన ఉత్తమ్
దిశ, తెలంగాణ బ్యూరో : నిఖార్సైన, నిబద్ధత గల నేత రాజేశ్వర్ అని.. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేత రాజేశ్వర్ సంతాప సభను వర్చువల్ పద్దతిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో రాజేశ్వర్ లాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. జీవితాంతం ప్రజలకు, పార్టీకి నిస్వార్ధంగా సేవలందించిన నేత రాజేశ్వర్ అని కొనియాడారు. ముషీరాబాద్ ప్రజలకు ఆయన చెసిన సేవలకు గుర్తుగా రామ్ నగర్ అడిక్‌మెట్ లింక్ బ్రిడ్జికి రాజేశ్వర్ పేరు పెట్టాలని, జీహెచ్‌ఎంసీ ద్వారా ఆయన నిర్మింపజేసిన కమ్యూనిటీ హాళ్లలో ఒక దానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎమ్. కోదండ రెడ్డి అధ్వర్యంలో సంతాప సభ జరిగింది.