కేసీఆర్‌కు సిగ్గు రావట్లేదు: ఉత్తమ్

by Anukaran |   ( Updated:2020-09-05 05:50:14.0  )
కేసీఆర్‌కు సిగ్గు రావట్లేదు: ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరోనా విషయంలో హైకోర్టు, గవర్నర్ తిట్టినా కేసీఆర్‌కు సిగ్గు రావట్లేదని విరుచుకుపడ్డారు. మేం మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇన్ని తిట్లు తింటూ ఈటల రాజేందర్ ఎందుకు మంత్రి పదవిలో ఉంటున్నారో చెప్పాలన్నారు. ప్రజల మరణాలను తక్కువ చేసి చూపెడుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలకు లక్షల్లో బిల్లులు వేస్తున్నా ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సూట్ కేసులు సీఎం ఇంటికి పోతున్నాయా, లేకుంటే ఈటల ఇంటికి వస్తున్నాయో చెప్పాలని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed