- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యాపిల్స్‌పై సూర్యుడు వేసిన టాటూలు
దిశ, ఫీచర్స్ : బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందించే బహుమతికి సృజనాత్మకత జోడిస్తే ఆ కానుక విలువే మారిపోతుదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే జపనీయులు తమ వారి శ్రేయస్సును కోరుతూ ‘యాపిల్స్’ బహుమతిగా ఇస్తుంటారు. అయితే వాటిమీద శుభాసీస్సులు, అందమైన బొమ్మలు, లక్కీ లెటర్స్ లాంటి వాటిని ‘ఆర్ట్’ వేయడానికి జపనీయులు ‘మోజీ రింగో’ అనే టెక్నిక్ యూజ్ చేస్తారు.
‘మోజీ రింగో’ జపనీస్ టెక్నిక్. ఇందులో రసాయనాలను ఉపయోగించకుండా అందంగా అలంకరించిన యాపిల్స్‌ను తయారు చేయడానికి సూర్యుడి శక్తిని ఉపయోగిస్తారు. శతాబ్దాలుగా అమోరిలోని ఆపిల్ పండించేవారు మోజీ రింగో పద్ధతిని ఉపయోగించి కళాత్మకమైన ఆపిల్‌లను తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.ముట్సు లేదా స్టార్క్ జంబో వంటి పెద్ద ఆపిల్ రకాలు మోజీ రింగోకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అవి క్లిష్టమైన డిజైన్ కోసం ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటాయి.
జనవరిలో జపనీయులు యాపిల్స్ పంట మొదలుపెడతారు. యాపిల్ చెట్లకు పండ్లు ఏర్పడటం ప్రారంభించిన తర్వాత వాటిని తెగుళ్లతో పాటు, సూర్యకాంతి నుంచి రక్షించడానికి బహుళ-లేయర్డ్ ప్లాస్టిక్ సంచులతో కప్పేస్తారు. ఈ క్రమంలో ఆపిల్‌పై తొక్క భాగం రంగు పాలిపోకుండా ఉండేలా స్టెన్సిల్స్(కార్డ్, ప్లాస్టిక్, లేదా లోహానికి చెందిన పలుచని షీట్. దాని నుండి కత్తిరించిన నమూనా లేదా అక్షరాలతో రంధ్రాల ద్వారా సిరా లేదా పెయింట్ ఉపయోగించి దిగువ ఉపరితలంపై కట్ డిజైన్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు)ను అప్లయ్ చేస్తారు. కోతకాలంలో స్టెన్సిల్ తొలగిస్తారు. ఇక చివర్లో కొంతకాలం సూర్యకాంతికి దూరంగా యాపిల్స్ స్టోర్ చేస్తారు.
యాపిల్స్‌ను “చీకటిలో” ఎక్కువసేపు ఉంచడం వల్ల వాటి ఫోటోసెన్సిటివిటీ పెరుగుతుంది. కాబట్టి చివరకు ప్లాస్టిక్ సంచులను తొలగించినప్పుడు వాటి చర్మం ఎర్రగా మారే ఆంథోసైనిన్‌ను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి. మోజీ రింగో ప్రక్రియ చివరి దశలో స్టెన్సిల్ చుట్టూ చర్మం మాత్రమే ఎర్రగా మారి, ఆ ఆర్ట్ మనకు అద్భుతంగా కనిపిస్తుంది. సందేశాలు, అదృష్ట సంఖ్యలు, శ్రేయస్సు కోరే చిహ్నాలతో అచ్చువేసిన ఈ యాపిల్స్‌ను జపనీయులు బహుమతులుగా ఇస్తారు. అక్కడ వందల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
మోజీ రింగో టెక్నిక్ చాలా సరళంగా అనిపించినప్పటికీ, దీనికి చాలా సహనం అవసరం. అంతేకాదు ఆర్థిక దృక్కోణపరంగా ఈ యాపిల్స్ అంత విలువైనవి కావు. అందుకే పాత సాంప్రదాయం నెమ్మదిగా క్షీణిస్తోంది. కొన్ని అమోరి తోట యజమానులు మాత్రమే ‘మోజీరింగో’ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. మోజీ రింగో టెక్నిక్ చైనా, ఇతర ఆసియా దేశాలలో “ఆపిల్ టాటూయింగ్” పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది