చైనా, రష్యా వ్యాక్సిన్‌లు వినియోగించం: యూఎస్

by  |
చైనా, రష్యా వ్యాక్సిన్‌లు వినియోగించం: యూఎస్
X

వాషింగ్టన్: చైనా, రష్యాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ సేఫ్టీపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిని నిలువరించడానికి అభివృద్ధి చేస్తున్న టీకాల్లో చైనా కంపెనీలూ ముందువరుసలో ఉన్నాయి. రష్యానైతే సెప్టెంబర్‌లోపు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నది. అయితే, అమెరికా నుంచి మొడెర్నా, ఇంగ్లాండ్ నుంచి ఆక్స్‌ఫర్డ్ టీకాలపైనే ప్రపంచదేశాలు చాలా వరకు ఆశలుపెట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన టాప్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్యం కన్నా రెగ్యులేటరీ సంస్థలు పారదర్శకంగా లేని దేశాల టీకాలను అమెరికా స్వీకరించబోదని తెలిపారు. ముఖ్యంగా చైనా, రష్యాల టీకాను వినియోగించే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. ఈ దేశాలు టీకాపై సరైన ప్రయోగాలు చేపట్టకుండానే టెస్టులు చేస్తున్నాయని ఆరోపించారు. సరైన టెస్టులు చేయకుండానే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉంచితే ఉన్నదానికితోడు అదనంగా సమస్యలను కోరితెచ్చుకున్నట్టే అవుతుందని అన్నారు.


Next Story

Most Viewed