మెగా హీరో వైష్ణవ్‌తేజ్ ‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఫిక్స్డ్

by Shyam |
మెగా హీరో వైష్ణవ్‌తేజ్ ‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఫిక్స్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫ్రెష్ లవ్ స్టోరీతో వస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించగా.. బుచ్చిబాబు సన దర్శకులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే కానుకగా వచ్చే నెల 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ యూత్‌ను ఆకట్టుకోగా..సినిమా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అవుతోందనే ధీమాతో ఉంది మూవీ యూనిట్. కాగా, ఉప్పెనలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.

Advertisement

Next Story

Most Viewed