విశ్వక్ సేన్ 'పాగల్‌'లో 'ఉప్పెన' బ్యూటీ

by Shyam |
విశ్వక్ సేన్ పాగల్‌లో ఉప్పెన బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి .. ఫస్ట్ లుక్‌తోనే కుర్రకారును పడేసింది. ఆ అందాన్ని ఒక్క సారి చూస్తే కళ్లు తిప్పుకోవడం కష్టమే… అంతటి అందాన్ని పొగడాలన్న కొత్త కొత్త మాటలను అప్పు అడగాల్సిందేనేమో… సొట్ట బుగ్గలు, నీలి సముద్రంలాంటి కళ్లు, ముత్యాల్లాంటి పళ్ల వరుస… ఎంతసేపు చూసినా చూడాలనిపించే ఆ నవ్వు.. యూత్ మతి పోగొట్టేసింది. అందుకే ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చేస్తున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా సుకుమార్ రైటింగ్స్‌లో వస్తున్న ’18 పేజీస్’ సినిమాలో కృతినే హీరోయిన్‌గా ఎంచుకుంది మూవీ యూనిట్. అయితే ఇప్పుడు ఈ అందాల భామకు మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్‌ ‘ఫలక్‌నుమా దాస్’ విశ్వక్ సేన్ తర్వాతి చిత్రం ‘పాగల్‌’లో ఈ భామనే హీరోయిన్‌గా చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. దీంతో విశ్వక్, కృతి కాంబినేషన్ తెరపై అదిరిపోతుందంటున్నారు అభిమానులు. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో వస్తున్న సినిమాను ఈ మధ్యే లాంచ్ చేశారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ‘పాగల్’ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ రెండో వారం నుంచి ప్లాన్ చేసినా…. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడే అవకాశం ఉంది.

Tags: Vishwak Sen, Pagal, Uppena, Krithi Shetty, 18 Pages

Advertisement

Next Story