- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భువనగిరి కోటకు రోప్‌వే: ఉప్పల శ్రీనివాస్ గుప్త
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త అన్నారు. సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అధికారులతో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్హంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. భువనగిరి కోటకు రోప్‌వే, వరంగల్ జిల్లా వాడపల్లి చెరువును అభివృద్ధి చేస్తామని, రీసార్టులు, రహదారిలో సదుపాయాలు, వారసత్వ సంపదను కాపాడుతామన్నారు. చెరువు దగ్గర ఎకో టూరిజం దిశగా అడుగులు వేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఫుట్ బాల్ గ్రౌండ్ల ఏర్పాటు, ఉద్యోగులంతా చేనేత వస్త్రాలను ధరించేటట్లు చూస్తామన్నారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచన మేరకు పర్యాటక రంగాన్ని మరింతగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.