పారిశ్రామిక సంఘాలతో యూపీ సర్కారు ఒప్పందాలు

by Shamantha N |
పారిశ్రామిక సంఘాలతో యూపీ సర్కారు ఒప్పందాలు
X

లక్నో: లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగివచ్చిన సుమారు 11 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక పారిశ్రామిక సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసంలో శుక్రవారం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ అంశంపై రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వర్గాలతో టచ్‌లో ఉన్నామని, అంతర్జాతీయ సంస్థలనూ ఆకర్షించే కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులతో వచ్చే పరిశమ్రల్లో వలస కూలీలకు ఉపాధి కల్పించేందుకు సర్కారు సంకల్పించినట్టు తెలిపారు. ఇప్పటికే 18 లక్షల వలస కూలీల నైపుణ్యాల వివరాలను సేకరించామని, వారందరికీ ఉపాధి కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ 2.5 లక్షలమంది వర్కర్లకు, ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 4.5లక్షల మంది కార్మికులకు, లఘు ఉద్యోగ భారతి రెండు లక్షల మంది శ్రామికులకు ఉపాధి కల్పించనున్నాయని వెల్లడించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా రెండు లక్షల మంది వర్కర్లకు ఉపాధి ఇచ్చే ఒప్పందంపై సంతకం పెట్టిందని సిద్ధార్థ్ నాథ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed