UNION BUDGET-2024: టూరిజం డెవలప్‌మెంట్‌పై కేంద్రం ఫోకస్.. టూరిజం హబ్‌గా లక్షద్వీప్

by Shiva |   ( Updated:2024-02-01 07:05:45.0  )
UNION BUDGET-2024: టూరిజం డెవలప్‌మెంట్‌పై కేంద్రం ఫోకస్.. టూరిజం హబ్‌గా లక్షద్వీప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో టూరిజం డెవలప్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక, టూరిజం డెవెలప్‌మెంట్‌ను ప్రోత్సహించేందకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఇప్పటికే ఆ దిశగా టూరిజంను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యున్నత టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేందుకు వడ్డీ లేని రుణాలు, ఆ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించనున్నట్లు నిర్మలా పేర్కొన్నారు.

కాగా, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ అంశంపై భారత్‌లో ఉన్న ప్రతి పౌరుడు ఆగ్రహంతో రగిలిపోయారు. దేశం అంతా ప్రధాని మోడీకి అండగా నిలబడ్డారు. ‘#బైకాట్ మాల్దీవ్స్’ మూమెంట్ ట్విట్టర్‌ను కూడా షేక్ చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మన దేశంలో అంతర్భాగమైన లక్షద్వీప్‌లో పర్యటించారు. ఇండైరెక్ట్‌గా మనకు కూడా ఓ అందమైన ప్రదేశం ఉందంటూ లక్ష్యద్వీప్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు దేశంలోని రాజకీయ, సీని ప్రముఖులు కూడా తమ స్పందనను తెలియజేశారు. అయితే, ప్రస్తుతం మాల్దీవ్స్‌లో పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే కదా.

Advertisement

Next Story

Most Viewed