- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్వారంటైన్‌లోకి కేంద్ర మంత్రి, బీజేపీ జనరల్ సెక్రెటరీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. తమ మిత్రుడు జమ్మూకాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీంద్ర రైనాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యినట్లు వార్తలు రాగానే మంగళవారం సాయంత్రం నుంచి క్వారంటైన్ లోకి వెళ్లినట్లు వీరిరువురు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 12వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి బంధిపుర వరకు రవీంద్ర రైనా తమకు తోడుగా వచ్చాడని, అందుకే ముందు జాగ్రత్తగా తాము క్వారంటైన్ లోకి వెళ్తున్నట్లు వీరిద్దరూ తెలిపారు. 2 రోజుల కిందట తాను రవీందర్‌ను కలిశారని, గత వారంలో నాలుగు సార్లు తనకు కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ క్వారంటైన్‌కు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. ఇటీవలే ఉగ్రవాదుల దాడిలో మరణించిన బీజేపీ నేత కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు ఇరువురు నేతలు జమ్ము కాశ్మీర్ వెళ్లిన సంగతి తెలిసిందే.