ఆ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స దోపిడీని అరికట్టాలి

by Shyam |   ( Updated:2020-08-31 08:02:20.0  )
ఆ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స దోపిడీని అరికట్టాలి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జనరిక్ మందుల దుకాణాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, ఇతర అధికారులతో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల కోసం శానిటర్ పాడ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. నగరంలోని బస్తీ దవాఖానలు, వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేయడంతో పాటు, కోవిడ్ టెస్టులు పెంచాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స దోపిడీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుచేయాలని, బస్తీలలోని కమ్యూనిటీ హాల్స్‌లో అంగన్వాడీ సెంటర్స్ పెట్టుకొనేందుకు సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేయాలని, పీఎం ఆత్మ నిర్బర్ స్ట్రీట్ వెండర్ సన్మాన్ నిధి ప్రయోజనాలు, ప్రతి స్ట్రీట్ వెండర్‌కు అందేలా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలని కిషన్ రెడ్డి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed