- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్‌న్యూస్: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అన్నారు. ఒక లీటర్ పెట్రోల్ ధర కొన్ని చోట్ల సెంచరీని దాటింది. డీజిల్, ఎల్పీజీ ధరలూ చుక్కలనంటడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇదే తరుణంలో ఐదు అసెంబ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకునపడింది. మరో రెండు రోజుల్లో కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం ప్రజలకు ఉపశమనమిచ్చే వార్త తెలియజేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయని, భవిష్యత్‌లో మరింత తగ్గుతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుపై తగ్గిన ధరను వినియోగదారులకు అందజేస్తామని వివరించారు. ఇందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.