IPL: రిషబ్ పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ ఎంతంటే?

by Gantepaka Srikanth |
IPL: రిషబ్ పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్‌(Lucknow Super Giants)తో చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings) తలపడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం ఇందుకు వేదికైంది. అయితే సీఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లక్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(30), రిషబ్ పంత్(63), అయుష్ బదోని(22), అబ్దుల్ సమద్(20) పరుగులు చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేశారు. చెన్నై విజయం సాధించాలంటే 167 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీశారు.



Next Story

Most Viewed