NCERT: ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. భాషా వివాదం వేళ కీలక పరిణామం

by vinod kumar |   ( Updated:2025-04-14 16:08:28.0  )
NCERT: ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్ పుస్తకాలకు హిందీ పేర్లు.. భాషా వివాదం వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: త్రి భాషా విధానంపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీఈఆర్టీ (NCERT) కొత్తగా ముద్రించిన అనేక ఇంగ్లీష్ మీడియం పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టింది. రోమన్ లిపిలో హిందీ శీర్షికలను ఇచ్చింది. వాటిలో ఇంగ్లీష్ బోధించడానికి ఉద్దేశించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆరో తరగతి ఇంగ్లీష్ పుస్తకాన్ని గతంలో హనీసకిల్ అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పుస్తకానికి పూర్వి అనే హిందీ పేరు పెట్టారు. ఈ పదానికి తూర్పు అని అర్థం. అలాగే 1, 2 తరగతుల ఇంగ్లీష్ టెక్ట్స్ బుక్స్‌కు మృదంగ్ అని మూడో తరగతి పాఠ్యపుస్తకాలకు సంతూర్ అని పేరు పెట్టారు. ఇవి రెండూ భారతీయ సంగీత వాయిద్యాల పేర్లు కావడం గమనార్హం. అయితే ఈ పేర్లు పెట్టడానికి గల కారణమేంటో అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో ఎన్సీఈఆర్టీ తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దడానికి ఇది ఒక రహస్య ప్రయత్నమని పలువురు ఆరోపిస్తున్నారు. హిందీ శీర్షికలను రోమన్ లిపి ఉపయోగించి వ్రాయడం వలన, వాటిని తప్పుగా ఉచ్చరించే అవకాశం ఉందని ఒక రిటైర్డ్ భాషావేత్త పేర్కొన్నారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (Education Policy) ప్రకారం ఎన్సీఈఆర్టీ 2023లో కొత్త టెక్ట్స్ బుక్స్‌ను ముద్రించడం ప్రారంభించింది. మొదట 1,2వ తరగతుల బుక్స్ రిలీజ్ కాగా, 2024లో మూడు, నాలుగు, ప్రస్తుత ఏడాదిలో 8వ తరగతి వరకు పుస్తకాలు వెలువడ్డాయి.



Next Story

Most Viewed