సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్

by Shamantha N |
సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్
X

దిశ, న్యూస్ బ్యూరో:
వ్యాక్సిన్ తయారీ కోసం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించుకోడానికి భారత్ బయోటెక్ సంస్థకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పరిధిలోని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అనుమతి మంజూరు చేశారు. సాధారణ నిబంధనలకు స్వల్ప సవరణలు చేయాలని చేసిన విజ్ఞప్తికి కూడా సానుకూలంగా స్పందించారు. మొదటి దశ ట్రయల్స్ నిర్వహించిన తీరుపై నివేదిక సమర్పించారు. దీంతో పాటు రెండో దశ అనుమతి నిమిత్తం ఇ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న గంటల వ్యవధిలోనే సానుకూల స్పందన రావడం గమనార్హం. రెండవ దశలో దేశవ్యాప్తంగా 380 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. వాలంటీర్ల ఎంపిక కోసం స్క్రీనింగ్ గడువును కూడా నాలుగు రోజులకు సవరిస్తూ డైరెక్టర్ జనరల్ అనుమతి మంజూరు చేశారు.రష్యాలో రాజ్‌నాథ్ సింగ్ లాస్ట్ డే…

రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్ కోరినట్లుగా కొన్ని నిబంధనలను సడలించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. విజ్ఞప్తి చేసినవి మినహా మిగిలిన నిబంధనలన్నీ యధావిధిగా అమలవుతాయని డైరెక్టర్ జనరల్ తరఫున జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ ఈశ్వర్ రెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story