దుప్పల్లిలో గుర్తుతెలియని మృతదేహం

by Shyam |   ( Updated:2020-11-04 00:09:06.0  )
దుప్పల్లిలో గుర్తుతెలియని మృతదేహం
X

దిశ, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామశివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్ఐ శివనాగ ప్రసాద్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వదరల్లో మృతదేహం కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 9440795619 కు సమాచారం అందించాల్సిందిగా ఎస్ఐ తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed