ఆ రాళ్లకు యునెస్కో గుర్తింపు రావాలి.. డాక్యుమెంటరీ తీయాలన్న కిషన్ రెడ్డి

by Shyam |
ఆ రాళ్లకు యునెస్కో గుర్తింపు రావాలి.. డాక్యుమెంటరీ తీయాలన్న కిషన్ రెడ్డి
X

దిశ, మక్తల్: చారిత్రాత్మక ముడుమాల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు ద‌క్కించేందుకు కృషి చేయాల‌ని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డికి టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్తల సార‌థ్యంలోని బృందం వినతి పత్రం ఇచ్చారు. అందుకు కిషన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని సందీప్ ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. నిలువురాళ్లకు యునెస్కో హోదా కోసం చేస్తున్న కృషిలో భాగంగా ముడుమాల్ నిలువురాళ్ల గురించి అన్ని వివ‌రాల‌తో డాక్యుమెంట‌రీ రూపొందించాల‌ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమకు సూచించారన్నారు. యునెస్కో గుర్తింపు ప్రక్రియ‌కు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌పై త్వర‌లో అధికారులు స‌మావేశం కానున్నట్లు ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి హామీ ఇచ్చారని సందీప్ మ‌ఖ్తల ప్రకటనలో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed