- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాదిలో అత్యధికంగా నిరుద్యోగం..
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా నిరుద్యోగం మరోసారి పతనమైంది. మే నెలలో భారత నిరుద్యోగ రేటు గత ఏడాదిలోనే అత్యధికంగా 11.9 శాతానికి చేరుకుంది. సెకెండ్ వేవ్ వల్ల దేశంలోని అనేక రాష్ట్రాల్లో కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు అమలు కావడంతో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ఏప్రిల్‌లో 7.97 శాతంగా ఉన్న నిరుద్యోగం ఏకంగా 11.9 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) గణాంకాలు గురువారం వెల్లడించాయి. గతేడాది ఇదే నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అత్యంత గరిష్ఠ స్థాయి 23 శాతానికి నిరుద్యోగ రేటు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ నెలలో ఇది 10.18 శాతానికి తగ్గింది.
సీఎంఐఈ డేటా ప్రకారం.. మొత్తం నిరుద్యోగ రేటులో పట్టణ నిరుద్యోగం మేలో 14.73 శాతానికి పెరగా, గ్రామీణ నిరుద్యోగం 10.63 శాతంగా ఉంది. అంతేకాకుండా, ఈ ఏడాది మే నెలకు సంబంధించి వినియోగదారుల సెంటిమెంట్ ఏప్రిల్‌లో 54.4 నుంచి మేలో 48.6కి తగ్గినట్టు సీఎంఐఈ తెలిపింది. ‘కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా భారత ఆర్థిక పునరుద్ధరణ మందగించింది. నిరుద్యోగం మరోసారి గరిస్ఠ స్థాయిలలో నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికవ్యవస్థ రికవరీకి సానుకూలంగా మార్చేందుకు భరాత కుటుంబ వర్గాలు, వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని’ సీఎంఐఈ తన నివేదికలో అభిప్రాయపడింది.