- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాడు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. నేడు అదే ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నారు
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలప్రదేశ్‌గా మారిపోయిందని ట్విటర్ వేదికగా విమర్శించారు. వైసీపీని గెలిపిస్తే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన వైసీపీ ఇప్పుడు నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే 2.30 లక్షల ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులు.. నేడు అదే ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ ఘటన తనను కలచివేసిందన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి సరస్వతీ పుత్రుడు అనిపించుకున్న వీరాంజనేయులు.. జగన్ మోసపూరిత హామీలకు బలైపోయాడన్నారు. వీరాంజనేయులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వీరాంజనేయులు మాదిరిగా రాష్ట్రంలో మరే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణమే ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినదని చెప్పుకొచ్చారు. యువత, నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని.. పోరాడి ఉద్యోగాలు సాధిద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు.