- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘RS ప్రవీణ్ కుమార్ కులపిచ్చి అధికారి.. కేసీఆర్ కోవర్ట్’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గురుకులాల్లో సంబంధిత వర్గానికి చెందిన అధికారిని నియమించకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీ గురుకులాలకూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా ఉండటం సిగ్గుచేటని ఆయనో కులపిచ్చి అధికారని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ అన్నారు. నల్గొండ జిల్లాలో సభకి ఎవరూ వెళ్లొద్దని పిలుపునిస్తూ బుధవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లోని ప్రిన్సిపల్ ప్రమోషన్‌లను గిరిజనులకు ఇవ్వకుండా కేవలం ఎస్సీ వారికే ఇస్తున్నారన్నారు. నిరుద్యోగులను మోసం చేసేవిధంగా గురుకుల టీచర్లను కూడా ఎస్సీ వాళ్ళని తీసుకొని గిరిజనులను మోసం చేస్తున్నారన్నారు. కేవలం ఎస్సీ వాళ్లకే మద్దతు తెలిపి బహుజన వాదాన్ని పైకి చూపిస్తున్నారన్నారు. ఆర్ఎస్‌పీ సీఎం కేసీఆర్‌కి కోవర్టుగా పనిచేస్తున్నారని బహిరంగంగా నిరూపిస్తాం అని పేర్కొన్నారు.
- Tags
- Bhimrao Naik
- BSP