ఇంట్లో అద్దెకి దిగి ఓనర్ కోడలితో ఎఫైర్.. గంటన్నరలో పని ముగించిన మామ

by Sumithra |   ( Updated:2021-08-25 08:53:54.0  )
illicit affair
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మామ ఉన్మాదిగా మారాడు. ఇంటి తలుపులు పెట్టి వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఓ చిన్నారిని సహా నలుగురిని తెగ నరికేశాడు. అడ్డువచ్చిన వారిని కూడా వద్దలేదు. గంటన్నర పాటు జరిగిన ఈ నరమేధం తర్వాత అతడు రిలాక్స్ అయ్యాడు. నిందితుడు ఆర్మీ మాజీ అధికారి కావడం గమనార్హం. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోర ఘటన హర్యానాలో జరిగింది.

గురుగ్రామ్ పట్టణానికి చెందిన రావు రాయిసింగ్ యాదవ్ ఆర్మీ మాజీ అధికారి. ఆయన ఇంట్లో కొంతకాలంగా క్రిష్ణన్ తివారి తన భార్య అనామిక తివారి, తొమిదేళ్ల కూతురుతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అయితే క్రిష్ణన్ తివారి ఇటీవల రాయిసింగ్ యాదవ్ కోడలు సునీతా యాదవ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆయన గుర్తించాడు. అది జీర్ణించుకోలేని రాయిసింగ్ యాదవ్.. తివారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

దీనిలో భాగంగా బెడ్ రూంలో ఉన్న కోడలు సునీతా యాదవ్‌ను రూంలోనే బంధించి మొక్కలను కత్తిరించే కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం కృష్ణన్ తివారి గదిలోకి వెళ్లి ఆయనను, భార్యను నరికి చంపాడు. అడ్డు వచ్చిన వారి తొమ్మిదేళ్ల కూతురిపై కూడా కత్తి వేట్లు వేశాడు. రాయిసింగ్ యాదవ్ కోడలు సహా కృష్ణన్ దంపతులు అక్కడికక్కడే హతమవ్వగా చిన్నారి తీవ్రగాయాలు అయ్యాయి.

గంటన్నరపాటు జరిగిన మారణ హోమం తర్వాత రాయిసింగ్ యాదవ్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే హత్యలు చేశానని ఆయన పోలీసులకు వివరించాడు. వెంటనే రాయిసింగ్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయిసింగ్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more

నేను నీ కూతుర్ని నాన్నా.. అంటున్నా వదలకుండా తండ్రి అత్యాచారం

Advertisement

Next Story

Most Viewed