- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోడలికి ప్రియుడితో వివాహం చేస్తానని.. బ్రిడ్జి కింద..
దిశ, వెబ్‌డెస్క్ : మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి. మేన కోడలును కంటికి రెప్పలా చేసుకోవాల్సిన మామ.. అత్యంత కఠినంగా వ్యవహరించాడు. అప్పటికే భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న సోదరికి గర్భశోకాన్ని మిగిల్చాడు. కోరుకున్న ప్రియుడితో పెళ్లి చేస్తానని తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ తాలూకా జమ్మలదిన్ని క్రాస్ ఇణచగల్ బ్రిడ్జి కింద ఈనెల 9న గుర్తు తెలియని బాలిక మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీనిని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఘటన స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు నలోగి పోలీస్ స్టేషన్ అధికారులు.
కలబుర్గి జిల్లా బళుండగి గ్రామంలో సిద్దరామప్ప కల్లప్ప ఆవటి(43) నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్ల క్రితం సోదరి భర్త చనిపోవడంతో కూతురుతో ఉన్న ఆమెను తీసుకోచ్చి తన ఇంట్లోనే నివాసం ఏర్పాటు చేశారు. అయితే సోదరి కూతురు ఆరతి మల్లప్ప (17) అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన మేనమామ ఆగ్రహం చెంది.. కోడలిని చంపాలని ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగా కూడలసంగమలో నువ్వు కోరుకున్న ప్రియుడితో వివాహం చేస్తానని మేనమేడలును నమ్మించి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేసి పరారీ అయ్యాడు. హతురాలిని గుర్తించిన పోలీసులు మేనమామ కోసం ఆరా తీయగా.. హత్య జరిగిన నాటి నుంచి అదృశ్యం అయినట్లు గుర్తించారు. సాంకేతికను ఉపయోగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య గల కారణాలను విచారించగా.. తాము అల్లారు ముద్దుగా పెంచినా హద్దులు దాటి ప్రవర్తించిదని, అందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.