అప్పులు తీర్చలేక ఆత్మహత్య

by Sumithra |
అప్పులు తీర్చలేక ఆత్మహత్య
X

దిశ,మోత్కూరు: మోత్కూర్ మండలం దత్తప్పగూడెం గ్రామంలో అప్పులు తీర్చలేక… మనస్థాపం చెంది ఓ పాలేరు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోత్కూర్ ఎస్.ఐ జీ. ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం… దత్తప్పగూడెం గ్రామానికి చెందిన పావిరాల వెంకటయ్య (55) అదే గ్రామానికి చెందిన రైతు కంచర్ల రామలింగారెడ్డి వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు.

కాగా వెంకటయ్య తన ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం అప్పులు చేశాడు. ఆ అప్పులను ఎలా తీర్చాలో తెలియక వెంకటయ్య మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వెంకటయ్య సోమవారం రైతు రామలింగారెడ్డికి చెందిన వ్యవసాయ బావి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story