మెరుగైన జీవనం కోసం వెళ్తూ.. 57 మంది జల సమాధి

by Anukaran |
మెరుగైన జీవనం కోసం వెళ్తూ.. 57 మంది జల సమాధి
X

దిశ, వెబ్‌డెస్క్: లిబియాలోని ట్రిపోలీలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పడవ నీటమునగడంతో 57 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో పడవలో 75 మంది వలస కార్మికులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 20 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా మధ్యదరా సముద్రం మీదుగా మరింత మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలో నిలిచిపోయింది. అయితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదాన్ని ఐక్యరాజ్యసమితి శరణార్థుల అధికారులు తెలిపారు. శరణార్థుల అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి సఫా సేహ్లీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఆ పడవ ఖూమ్స్ పట్టణ పశ్చిమ తీరం నుంచి బయలుదేరింది. అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పినట్లు అల్ జజీరా తెలిపింది. ప్రమాదంంలో 18 మందిని కాపాడి సోమవారం తీరానికి తీసుకొచ్చారని సేహ్లీ తెలిపారు. బతికిన వాళ్లలో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వాళ్లున్నట్లు సేహ్లీ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed