- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిశ్శబ్దంగా స్మార్ట్‌ఫోన్ల హ్యాక్!
దిశ, వెబ్‌డెస్క్:
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రయాణాల్లో, పనిచేసే చోట, చివరికి నిద్రలో కూడా సెల్‌ఫోన్ తోడుగా ఉంటుంది. దాదాపు స్మార్ట్‌ఫోన్లోనే అన్ని సీక్రెట్లు కూడా దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఫోన్లను వినియోగదారునికి తెలియకుండానే హ్యాక్ చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్లు ఎలా హ్యాక్ అవుతాయో డెమో కూడా చూపించారు.
సర్ఫింగ్ ఎటాక్ అని పిలిచే ఈ టెక్నాలజీ ద్వారా హ్యాకర్లు ఫోన్లో కొన్ని ప్రాథమిక వినియోగాలను అదుపులోకి తీసుకునే అవకాశం కలుగుతుంది. వినియోగదారుడికి తెలియకుండానే టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసేయొచ్చు. ఈ టెక్నాలజీ కోసం అల్ట్రా సోనిక్ తరంగాలను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ల్యాంబ్ వేవ్స్ అని పిలిచే వీటిని మానవ చెవి గుర్తించలేదు. వీటి ఫ్రీక్వెన్సీ 20 నుంచి 40 కిలో హెర్జ్‌లు ఉండటమే అందుకు కారణం. మానవ చెవి కేవలం 2 హెర్జ్‌ల నుంచి 20 కిలోహెర్జ్‌ల ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను మాత్రమే గుర్తించగలదు.
మొత్తం 17 ఫోన్ల మీద ఈ తరంగాలను పంపించి శాస్త్రవేత్తలు ప్రయోగం చేశారు. ఫోన్లలో ముఖ్యమైన సమాచారాన్ని దాన్ని ముట్టుకోకుండా బయటికి చదివించగలిగారు. మరొక ఫోన్‌లో దూరం నుంచి కాల్ చేయగలిగారు. సర్ఫింగ్ ఎటాక్ ప్రయోగం చేసిన 17 ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్, హువాయి మేట్ 9 ఫోన్లు మాత్రమే ఈ దాడిని తట్టుకోగలిగాయి. 30 ఫీట్ల దూరం నుంచి కూడా ఈ ఎటాక్ ఫలితాలను చూపించిందని ప్రయోగం చేసిన వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఫోన్లు డిజిటల్ హ్యాక్‌కి మాత్రమే కాకుండా ఇలా తరంగాల ద్వారా ఫిజికల్ హ్యాక్‌కి గురవుతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన నియంత్రణ చర్యలు చేపట్టడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ నింగ్ జాంగ్ అన్నారు.
Tags : Hack, Washington University, Surface Attack, Lamb Waves, Ultrasonic Waves