- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూభారతి చట్టంతో రైతుల సమస్యల పరిష్కారం

దిశ,దుబ్బాక : భూభారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని చట్టంపై రైతు లు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మంగళవారం దుబ్బాక, అక్బర్ పేట, భూంపల్లి మండల కేంద్రాల్లో సిద్దిపేట ఆర్డీవో సదానందం అధ్యక్షతన జరిగిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సాదాబైనామా లో కూడా ఈ చట్టం ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని జిల్లా స్థాయిలోనే భూ రికార్డుల్లోని తప్పొప్పులను సవరణ చేసుకోవడానికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందన్నారు. భూ క్రయ విక్రయాల పై తహశీల్దార్ విచారణ అనంతరం రైతులకు పట్టా పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం అందచేస్తుందన్నారు.
వారసత్వంగా వచ్చే భూమి నెల రోజుల్లోగా వారసుల పేరున రికార్డుల్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భూమి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగానే భూ ఆధార్ కార్డును ప్రతి రైతుకు అందజేస్తుందన్నారు. భూ విస్తీర్ణం కంటే అదనంగా రికార్డుల్లో నమోదు చేసుకున్న వారిపై ఫిర్యాదు చేసుకునే అవకాశం భూ భారతి కనిపిస్తోందన్నారు. రైతులకు సంబంధించిన అంగుళాభూమికి కూడా భూధార్ నెంబర్ కెటాయించడం జరుగుతుందన్నారు. రైతులకు పట్టాదారు పాస్ బుక్ తో పాటు సంబంధిత భూమి మ్యాప్ ను బుక్ లో పొందుపరచటం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం పర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏవో, తాజా మాజీ ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.