- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ తీసుకోండి’
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్ : కరోనా తీవ్రంగా వ్యాపిస్తుండటంతో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు భారత జట్టు ఇంగ్లాండ్ బయల్దేరనున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్ సిరీస్‌కు వెళ్లనున్న ఆటగాళ్లు తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని బీసీసీఐ చెప్పింది. అయితే కోవాగ్జిన్ బదులు కోవిషీల్డ్ వేసుకోవాలని బీసీసీఐ సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్లకు పంపిన సంక్షిప్త సందేశాల్లో బీసీసీఐ కేవలం కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకోవాలని చెప్పింది. ఇప్పటికే టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాక్సిన్ షాట్స్ తీసుకున్నారు. రవి శాస్త్రి రెండు డోసులు, ధావన్ ఒక డోసు పూర్తి చేసుకున్నారు. మిగిలిన క్రికెటర్లు కూడా ఇంగ్లాండ్ వెళ్లబోయే ముందు రెండు షాట్స్ తీసుకోవాలని బీసీసీఐ చెప్పింది.
Advertisement
Next Story