అలర్ట్.. ఆధార్ కార్డుతో మోసాలు

by Shamantha N |   ( Updated:2021-07-15 05:27:31.0  )
అలర్ట్.. ఆధార్ కార్డుతో మోసాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : యూఐడీఏఐ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ కార్డు ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయని, కార్డు విషయంలో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని యూఐడీఏఐ తమ అధికారిక ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆధార్ కార్డు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ వెరిఫికేషన్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు. మనకున్న ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి. ఆధార్ కార్డు ద్వారా మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆధార్ నెంబర్లను కేవలం ప్రూఫ్‌గా పరిగణలోకి తీసుకోవద్దని, ఎవరైనా ఆధార్ నెంబర్ చెబితే ఆ నెంబర్‌ను మళ్లీ చెక్ చేసుకోవాలని కోరింది.

ఆన్‌లైన్‌లో ఆధార్ https://resident.uidai.gov.in/verify ద్వారా మాత్రమే వెరిఫై చేసుకోవాలని సూచిస్తోంది. లేదంటే mAadhaar app ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చునని తెలిపింది. అలాగే పబ్లిక్ కంప్యూటర్లలో ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తే.. అవసరం అయిపోయిన వెంటనే వాటిని డిలేట్ చేయాలని పేర్కొంది. అలాగే ఓటీపీ ఎవ్వరికీ చెప్పొద్దని, అలాగే వేరొకరి మొబైల్ నెంబర్‌ను మీ ఆధార్‌కు అప్‌డేట్ చేసుకోవద్దని తెలిపింది. ఆధార్ సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటే టెలిఫోన్ నెంబర్ల 1947 (టోల్ ఫ్రీ) ద్వారా సంప్రదించాల్సిందిగా యూడీఐ సూచించింది. లేదంటే.. [email protected] ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. అయితే ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అదే ఆన్‌లైన్‌లో అయితే ఆధార్ వెరిఫై సర్వీసులు ఉపయోగించుకోవాలి. తద్వారా ఆధార్ నెంబర్‌ను ధ్రువీకరించుకోవాలి. అప్పుడు మోసాలకు ఆస్కారం ఉండదని యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed