కేరళ గోల్డ్ స్కాం.. నిందితుడి ఆత్మహత్యాయత్నం

by Sumithra |
కేరళ గోల్డ్ స్కాం.. నిందితుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ గోల్డ్ స్కాంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిందితుల్లో ఒకరైన జయఘోష్ శుక్రవారం ఆత్మహత్యయత్నం చేశాడు. ఇతను యూఏఈ కాన్సులేట్‌లో గన్‌మెన్‌గా విధులు నిర్వర్తించేవాడు. ఈ స్కాంలో ముఖ్య సూత్రదారి అయిన స్వప్న జయఘోష్‌తో రెగ్యూలర్ గా ఫోన్ మాట్లాడినట్లు సమాచారం. ఆమె కాల్ రికార్డులను తనిఖీ చేసిన NIA అధికారులకు గన్‌మెన్ జయఘోష్‌ నెంబర్ దొరికింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు ఈ గోల్డ్ స్కాంకు ఎలాంటి సంబంధం లేదని వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జయఘోష్‌ ఆత్మహత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నిందితులను NIA అరెస్టు చేసి విచారిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed