ఒకటి, రెండు, మూడు.. ప్లైయిట్ ఎక్కుతూ జారిపడిన జో బైడెన్

by Anukaran |   ( Updated:2023-03-30 17:59:10.0  )
ఒకటి, రెండు, మూడు..  ప్లైయిట్ ఎక్కుతూ జారిపడిన జో బైడెన్
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే సమయంలో పలుమార్లు జారిపడ్డారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ ప్రతినిధి కరీ జీన్-పియెర్ మాట్లాడుతూ వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద గాలులు వీస్తున్నాయి. అందుకే జో బైడెన్ ఫ్లైయిట్ మెట్లెక్కుతూ జారారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.

ఆసియా-అమెరికన్ పబ్లిక్ తో మాట్లాడేందుకు జో బైడెన్ అట్లాంటాకు ప్రత్యేక విమానంలో బయలు దేరారు. అయితే ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా విమానం ఎక్కే సమయంలో పలుమార్లు జో బైడెన్ జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో జో బైడెన్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. దీంతో జో బైడెన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్ హౌస్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.

Advertisement

Next Story