- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శారీపాల్స్ కొంటామని వచ్చి.. చీరలు దొబ్బేసిన కి‘లేడీ’లు
by Sumithra |

X
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఓ టైలర్ షాపునకు వచ్చిన ఇద్దరు మహిళలు జాకెట్లు, శారీపాల్ పేరుతో రూ.28 వేల విలువైన చీరలను దొంగిలించారు. ఈనెల 16న ఈ ఘటన వెలుగుచూడగా.. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు కిలేడీలను శుక్రవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎస్సై సురేష్ కథనం ప్రకారం.. మండలంలోని పొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన గుంటుక లత అనే మహిళ మండల కేంద్రంలో టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలు ఆమె దుకాణానికి వచ్చి షాపింగ్ పేరుతో రూ.28 వేల విలువైన చీరలు దొంగలిచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా వరంగల్‌కు చెందిన కాటరోజు విజయ, జీల్లోజు ఉషరాణిలుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
Next Story