- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎదురెదురుగా ఢీ కొన్న ద్విచక్ర వాహనాలు.. ఒకరి పరిస్థితి విషమం..
by Sumithra |
X
దిశ, నర్సంపేట : ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటన నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వైపు వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న మరొక బైక్ బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ కింద పడింది. ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
లారీ కింద ఇరుక్కున్న వారిని స్థానికులు బయటకు తీశారు. ఆ ఇద్దరు క్షతగాత్రులను దండు భార్గవ్, రాళ్లబండి కార్తీక్ అనే యువకులుగా, స్థానిక పోచమ్మ దేవాలయం దగ్గరలో నివాసం ఉండే వారిగా గుర్తించారు. వారిలో ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. హుటాహుటిన వరంగల్ లోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
Advertisement
Next Story