- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరులో ఇద్దరు దొంగలు.. వారి రూటే సపరేటు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆ దొంగల రూటే వేరు.. ఒకడు ఏటీఎం ఆపరేటింగ్ తెలియని అమాయకుల నుంచి డబ్బులు కొట్టేస్తే.. మరొకరు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, చైన్ స్నాచింగ్‌లు చేస్తుంటాడు. ఎట్టకేలకు వీరిద్దరి బాగోతం బయటపెట్టారు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు..
పూర్తి వివరాల్లోకి వెళితే..
నవాబ్‌పేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల శ్రీను కూలి పని చేస్తూ జీవనం గడిపేవాడు. అది కష్టమనిపించడంతో సులభంగా సంపాదించాలని దొంగతనాలు చేయడం ఆరంభించాడు. ఇదే క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కోస్గి, వంగూరు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను ఎత్తుకెళ్లాడు. అంతే కాదు.. జడ్చర్ల మండలం పెద్దపల్లి, ఖానాపూర్, నవ పేట మండలం కొండాపూర్, రాజాపూర్ మండల కేంద్రాల్లో తాళం వేసిన ఇండ్లు, ఒంటరిగా ఉన్న మహిళలను బెదిరించి ఆభరణాలు, నగదును దోచుకునేవాడు. ఈ నేపథ్యంలోనే బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగ ఆట కట్టించారు. నిందితుడి నుంచి రూ. 6,85,000 విలువైన బంగారం, నగదును చేసుకున్నారు.
రియల్ ఎస్టేట్ అంటూ.. ఏటీఏం సెంటర్ల వద్దనే..
జడ్చర్ల మండల కేంద్రంలో గత నెల ఓ ఏటీఎం.. గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు డ్రా చేస్తాను అని చెప్పి రూ. 33 వేల 400లను కొట్టేశాడు. ఇదే విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన పడమటి రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఉమ్మడి పాలమూరు, సిద్దిపేట, గజ్వేల్, ములుగు జిల్లాలోని వెంకటాపూర్ తదితర చోట్ల ఇటువంటి మోసాలకు పాల్పడినట్టు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానని బిల్డప్ ఇచ్చి అమాయకు జనాలకు కుచ్చిటోపి పెట్టాడని చెప్పారు ఎస్పీ. రమేష్ రెడ్డి నుంచి రూ. 2, 68,900లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.