- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉయ్యాలవాడలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. కరోనా టీకా అందుబాటులోకి వచ్చాక కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు తేలడంతో కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని జ్యోతిరావు పూలే స్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. 18 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన విద్యార్థులను ఐసోలేషన్‌కు తరలించారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో 26 మందికి పైగా విద్యార్థులకు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో రెండ్రోజుల్లో బడుల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు బడ్జెట్ సెషన్స్ సందర్భంగా సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు.