చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

by Sumithra |
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
X

దిశ,షాద్ నగర్: వాగులో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే….తలకొండపల్లి మండలం గడ్డమీది తండాకు చెందిన చంద్రు (26),మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంటి (15)లు చేపలు పట్టడానికి కేశంపేట మండలంలోని వాగుకు వెళ్లారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కాగా మృత దేహాలను గ్రామస్తులు చెరువునుంచి బయటకు తీసారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed