తేనె కోసం వెళ్లారు.. ప్రాణాలు కోల్పోయారు 

by Shyam |
తేనె కోసం వెళ్లారు.. ప్రాణాలు కోల్పోయారు 
X

దిశ, అచంపేట: తేనె కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేటలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. అమ్రాబాద్ మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ దాసరి బయన్న, దాసరి పెద్దలు, దాసరి వెంకటయ్య, శనివారం మధ్యాహ్నం తేనె తీయడానికి అడవికి వెళ్లారు. తేనె సేకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తాడు తెగిపోయి ముగ్గురు లోయలో పడి మృతిచెందినట్టు జంగంరెడ్డిపల్లి గ్రామస్తులు తెలిపారు. ఇందులో దాసరి బయన్న(35), దాసరి పెద్దులు(28), చనిపోగా వెంకటయ్యకు కాలు విరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. లోయలో పడిపోవడంతో మిగితా ఇద్దరి మృతదేహాల ఆచూకీ లభించకపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు. అంతరగంగా శివాలయానికి కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed