- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ వృద్ధులను చూసైనా బుద్ధి తెచ్చుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: మన దగ్గర మాస్క్‌లు ధరించండి అని చెప్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా నాకేం కాదులే! అనే ధీమాతో తిరుగుతున్నారు. అంతేకాకుండా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఇలాంటి మాస్క్‌రహిత మందబుద్ధిగాళ్లందరికీ ఇటలీకి చెందిన ఓ ఇద్దరు కురువృద్ధులు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెబుతున్నారు. వారి పేర్లు జియోవన్నీ కరెల్లీ, జియాంపిరో నోబిలీ. వీరి వయస్సు వరుసగా 82, 74 సంవత్సరాలు. వీరు ఎప్పుడు కలిసినా మాస్క్ ధరిస్తారు, కనీసం రెండు మీటర్ల సామాజిక దూరం పాటిస్తారు. ఇందులో వింత ఏముంది.. అలా చేసేవారు చాలా మంది ఉన్నారు కదా! వీళ్ల గురించి మాత్రమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముందని అనుకోకండి. అవసరం ఉంది. ఎందుకంటే..
వీరు ఉంటున్న నగర జనాభా 2. అంటే ఆ నగరంలో ఉండేది వీళ్లద్దరే అన్నమాట. అంబ్రియాలోని పెరుగియా ప్రావిన్స్‌లో ఉన్న నార్టోశ్చే నగరంలో ఈ ఇద్దరు కురువృద్ధులు నివాసం ఉంటున్నారు. ఈ నగరానికి వేరే ఎవరూ రారు. అలాగే వీరి నివాసాలకు చుట్టుపక్కల కూడా ఎవరూ ఉండరు. వీళ్లిద్దరూ వారి వారి ఇళ్లలో నుంచి బయటికి వెళ్లేది కూడా చాలా అరుదు. అంటే మూడో వ్యక్తి కారణంగా వీరు కొవిడ్ 19 బారిన పడే అవకాశాలు అసలే లేవు. అయినప్పటికీ ఇటాలియన్ ప్రభుత్వం విధించిన కొవిడ్ 19 నిబంధనలను వీరు నిబద్ధతతో పాటిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అనేది ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదని మీరు స్వయంగా సమాజం కోసం విధించిన నిబంధనలు పాటించడంలో ఎంత నిబద్ధత చూపిస్తున్నారనేదానికి నిదర్శనం అని నోబిలీ చెబుతున్నారు. అయితే కరెల్లీ మాత్రం.. తనకు ఆరోగ్యం పాడైతే తాను పెంచుకుంటున్న గొర్రెలు, మొక్కలను చూసుకోవడానికి ఎవరూ లేరని, అందుకే తాను నిబంధనలు పాటిస్తున్నానని నవ్వుతూ చెప్పారు. ఏదేమైనా ఒక ఆరోగ్యకరమైన నిబంధన పెడుతున్నారంటే అది మంచి కోసమే అనే దృక్పథాన్ని అలవాటు చేసుకుని, సమాజ శ్రేయస్సులో భాగం కావాల్సిన బాధ్యత ప్రతిఒక్కరికీ ఉంది.