కనీవినీ ఎరుగని స్థాయిలో BCCIకి ఆదాయం.. ఎందుకో తెలుసా?

by Shyam |
IPL
X

దిశ, వె‌బ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ లీగ్‌ ఏదంటే.. IPL అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన ఈ టోర్నీ వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో జరగనుంది. దీంతో IPL మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించనుంది. వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త జట్లు చేరనుండడంతో BCCI కి భారీ ఆదాయం రానుంది. IPL 15వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా BCCI కి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం. ప్రస్తుతం కంటే 15000-2000 కోట్లు అదనంగా ఆదాయం రానుందని తెలుస్తోంది.

లీగ్‌ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్ల కోసం IPL ప్రసార హక్కుల ధర రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ పలకనుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికి గాను గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి స్టార్‌ ఇండియా ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి. అయితే టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులకు కలిపి రూ.35-40 వేల కోట్ల ధర పలకొచ్చని తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఏడాది మాత్రం IPLకు భారీ జాక్‌పాట్‌ తగలనుండటంతో BCCI కి కాసుల వర్షం కురవనుంది.

Advertisement

Next Story

Most Viewed