సుక్మాలో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు

by Sumithra |   ( Updated:2021-08-30 10:42:51.0  )
సుక్మాలో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసులు ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. ఇందులో ఒకరు డీఏకేఎంఎస్ ఉపాధ్యక్షుడు మడివి పొజ్జా, మరొకరు మిలీషియా సభ్యుడు బట్టా వినోద్. సుక్మా ఎస్పీ సునీల్ శర్మ ఈ ఇద్దరు మావోయిస్టుల అరెస్టు వివరాలు మీడియాకి తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా చింతల్‌నార్ పోలీస్‌స్టేషన్ పరిథిలో కోబ్రా 201 బెటాలియన్ పోలీసులు, డిస్ట్రిక్ట్ ఫోర్స్ పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా తారసపడిన ఇద్దరు మావోయిస్టులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, కార్డెక్స్ వైరు, ఎలక్ట్రిక్ వైరు, పెన్సిల్ సెల్స్, నక్సల్స్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో జరిగిన అనేక సంఘటనలలో వీరు పాలుపంచుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. సెక్షన్ 4, 5 పేలుడు పదార్థాల చట్టం 1908 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed