రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి

by srinivas |
రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి
X

దిశ, మిర్యాలగూడ: తండ్రికి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన కమలాకర్ రెడ్డి (48) తన తండ్రి నంద గోపాల్ రెడ్డికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు ఆంబులెన్స్‌లో తీసుకొస్తున్నాడు. అయితే ఆంబులెన్స్ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తండ్రికొడుకులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, నందగోపాల్ తెలుగు సినీ నిర్మాత అని తెలిసింది. ఇటీవల విడుదల అయిన ‘‘కనులు కనులు దోచాయి’’ అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed