తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

by Aamani |

దిశ, ఆదిలాబాద్: కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గజానంద్ స్వీట్ హౌస్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై గజానంద్ స్వీట్ హౌస్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్‌పై కూడా చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed