- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అడ్డగించి తనిఖీలు చేస్తే అసలు విషయం బయటపడింది
దిశ, హైదరాబాద్: నగరంలో అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తరణ్ జ్యోత్ సింగ్, అమిత్ కుమార్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఫేస్ మాస్కుల అమ్మేందుకు వెళ్తున్నామని చెప్పి ఇంటర్ స్టేట్ పాస్ తీసుకుని బెంగళూరుకు వెళ్లారు. బెంగుళూరులోని ఉన్న ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్‌ను కొనుగోలు చేసి మే 30న హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. మారుతి స్విఫ్ట్ కారులో ఆ కొకైన్ ను తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం తిరుమలగిరి సరస్వతి నగర్ వద్ద ఆ వాహనాన్ని అడ్డగించి తనిఖీలు నిర్వహించింది. అనంతరం వారి నుంచి 54 గ్రాముల కొకైన్, 3 సెల్ ఫోన్లు, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రవాణా చేయడానికి ఉపయోగిస్తున్న స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.