- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి సక్సెస్..!
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
దేశంలోనే తొలిసారిగా కొవిడ్ పాజిటివ్ రోగికి చేసిన ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతమైంది. ఇటీవల కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్ర్త చికిత్స చేయగా రోగి కోలుకుని శుక్రవారం డిశ్ఛార్జి అయ్యారు.
గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలకు ఆద్యుడిగా పేరొందిన డాక్టర్ సందీప్ అట్టావర్ నేతృత్వంలో ఈ చికిత్స నిర్వహించారు. చండీఘడ్‌కు చెందిన రిజ్వాన్ ఎలియాస్ మోను ఊపిరితిత్తులకు తీవ్రంగా సర్కోయి డోసిస్ రావడంతో.. అతనికి ఊపిరితిత్తులు మార్చడమే ఏకైక పరిష్కారమని గుర్తించినట్లు సందీప్ అట్టావర్ తెలిపారు. అప్పటికే పాడైన ఊపిరితిత్తులు కొవిడ్ కారణంగా మరింత దెబ్బతిన్నట్లు చెప్పారు. కోల్‌కతాలో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి ఊపిరితిత్తులు రోగికి సరిపోయాయని.. వాటిని విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి అతనికి అమర్చడం వల్ల ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.