- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్ నుంచి హైదరాబాద్‌కు త్వరలో రెండు కంగారూలు
దిశ, చార్మినార్: నెహ్రూ జూలాజికల్ పార్కులో మరో రెండునెలల్లో రెండు కంగారులు రానున్నాయని జూ పార్కు క్యూరేటర్వీవీఎల్ సుభద్రా దేవి తెలిపారు. ఆ కంగారుల ఎన్క్లోజర్నిర్మాణ పనులకు అయ్యే ఖర్చును భరించడానికి దుండిగల్‌లోని గ్లాండ్ఫార్మా షూటికల్ లిమిటెడ్కంపెనీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కంగారుల ఎన్‌క్లోజర్ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్ఫార్మా లిమిటెడ్ కంపెనీ అధికారులు బుధవారం జూ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జూ పార్కు క్యూరేటర్ వీవీఎల్సుభద్రా దేవి మాట్లాడుతూ.. వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి కార్పొరేటర్సంస్థలు కూడా ఆసక్తి కనబరచడం సంతోషకరమైన విషయం అన్నారు. జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని ఓఖ్లాహామా జూపార్కు నుంచి నెహ్రూ జూలాజికల్పార్కుకు రెండు కంగారులు మరో రెండు నెలల్లో రానున్నాయన్నారు. కంగారులు జూకు వచ్చిన తర్వాత.. వచ్చే ఏడాది వాటిని దత్తత తీసుకుంటామని ఫార్మా కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మా షూటికల్ లిమిటెడ్ ప్రతినిధులు రఘురాం, పి.సంపత్, స్వాతితో పాటు జూ డిప్యూటి క్యూరేటర్నాగమణి తదితరులు పాల్గొన్నారు.