బీ కేర్ ఫుల్.. మార్కెట్‌లో నకిలీ రెమిడెసివర్

by Sumithra |
బీ కేర్ ఫుల్.. మార్కెట్‌లో నకిలీ రెమిడెసివర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ రెమిడెసివర్ ఇంజెక్షన్‌లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్, కాంపౌండర్ కుమ్మకై ఈ వ్యవహారం నడిపించారు. ఆర్మూర్ మండలానికి చెందిన రంజిత్ అనే వ్యక్తికి కరోనా సోకడంతో అతడికి రెమిడెసివర్ అత్యవసరం అయింది. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ సాయి కృష్ణ నాయుడు రెమిడెసివర్ అమ్ముతున్నారని సమాచారం రావడంతో.. ఆ ఆస్పత్రి కాంపౌండర్ మధ్యవర్తిత్వం వహించగా రూ. 35 వేలకు ఇంజెక్షన్ తీసుకున్నారు బాధితుడి బంధువులు.

తీరా ఆస్పత్రి వెళ్లి చూడగా.. రంజిత్‌ను పర్యవేక్షిస్తున్న వైద్యులు నకిలీ ఇంజెక్షణ్ అని తేల్చడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదరు హాస్పిటల్‌పై దాడులు చేసిన పోలీసులు మరో నకిలీ రెమిడెసివర్‌ ఇంజెక్షన్‌ను గుర్తించారు. డాక్టర్, కాంపౌండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ రాకెట్ వెనుక మరికొందరి ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, వరుసగా నకిలీ రెమిడెసివర్‌ ఘటనలు వెలుగుచూడడంతో.. కరోనా పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed