ప్రియుడి కోసం ఇద్దరు ప్రియురాళ్ల గొడవ.. నడిరోడ్డుపై అవి పట్టుకొని(వీడియో)..

by Anukaran |   ( Updated:2021-08-12 22:02:33.0  )
two girlfriends fight on road
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ.. ఈ రెండు అక్షరాలు ఎన్నో దారుణాలను చేయిస్తోంది. ప్రాణంగా ప్రేమించిన వారికోసం ప్రాణాలను వదిలేలా చేస్తోంది.. కొన్నిసార్లు ప్రాణాలు తీసేలా చేస్తోంది. ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటాం.. ఇక్కడ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడమంటే అలా, ఇలా కూడా కాదు.. నడిరోడ్డుపై అందరు చూస్తున్నారనే విచక్షణ కూడా మరిచి జుట్టులు పట్టుకొని మరీ గొడవకు దిగారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని జరాయ్‌కేలాలో నివసించే ఓ యువకుడు, ఒక యువతి ప్రేమించుకున్నారు. అయితే యువకుడు ప్రేమించిన యువతిని కాకుండా మరో యువతితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. ఇక తాను ప్రేమించిన వాడి పక్కన వేరొక యువతి ఉండడం చూసిన మొదటి గర్ల్ ఫ్రెండ్ ఆవేశంతో ఊగిపోయింది. నడిరోడ్డు అని చూడాలా..? చుట్టూ అందరు చూస్తారు అనేది ఆలోచించలేదు.. నా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతావా అంటూ మొదటి గర్ల్ ఫ్రెండ్, రెండో గర్ల్ ఫ్రెండ్ ని చెంపలు వాయించింది. దీంతో నేనేం తక్కువ తినలేదు అంటూ రెండో అమ్మాయి తిరగబడింది. ఆమె జుట్టు పట్టుకుని పిడిగుద్దులు కురిపించింది.

నా ప్రియుడంటే నా ప్రియుడు అంటూ ఇద్దరు పొట్టు పొట్టన కొట్టుకున్నారు. మధ్యలో ప్రియుడు వచ్చి వారించినా వారు వినలేదు. నడిరోడ్డుపై కిందపడి మరీ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. చివరికి పోలీసులు వస్తున్నారని తెలపడంతో మొదటి గర్ల్ ఫ్రెండ్ ఆమె స్నేహితురాలు పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed