అంబులెన్సులోనే ప్రాణాలు వదిలిన కరోనా బాధితులు

by srinivas |
died in the ambulance
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులే కాకుండా, మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరగడం ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన నలుగురు కరోనా బాధితులు మృతిచెందారు. బెడ్ల కోసం ఆస్పత్రి ఎదుట వేచి చూసి చూసి చివరకు ఇద్దరు బాధితులు అంబులెన్సులోనే ప్రాణాలు విడిచారు. మొత్తంగా ఆస్పత్రిలో బెడ్లు లేక, ట్రీట్‌మెంట్ అందక కొత్తగా నలుగురు మృతిచెందారు. ప్రస్తుతం కూడా ఆస్పత్రిలో బెడ్లు లేక అనేక మంది రోగులు ఆస్పత్రి బయట అంబులెన్సుల్లో, ఆటోల్లేనే మగ్గుతున్నారు. దీనికి స్పందించిన ఆస్పత్రి వైద్యులు వందల్లో కరోనా బాధితులు రావడంతో బెడ్ల కొరత ఏర్పడిందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed