- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వాగులో అన్నదమ్ములు గల్లంతు
by Shyam |

X
దిశ బాల్కొండ: మోర్తాడ్ మండలం గాండ్లపెట్ బ్రిడ్జి వద్ద పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. స్థానిక ఎస్సై సంపత్ కుమార్ వివరాల ప్రకారం… యానం గ్రామానికి చెందిన కుద్రథ్ ఖాన్ తన ఇద్దరు కుమారులు ఎండి.తయూబ్ ఖాన్, తాహేర్ ఖాన్(20) కుటుంబంతో గురువారం సరదాగా గాండ్లపేట్ గ్రామంలోని పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం వద్దకు వెళ్లారు.
అన్నదమ్ములు ఇద్దరు స్నానం చేయడం కోసం వాగులోకి దిగారు. వారిద్దరికీ ఈత రాకపోవడంతోవాగులో గల్లంతయ్యారు. స్థానికులు ఎంత గాలించిన ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి ఆర్మూర్ ఏసీపీ రఘు, ఆర్డీఓ శ్రీనివాసులు, సీఐ సైదయ్య, మోర్తాడ్ ఎమ్మార్యో శ్రీధర్‌లు చేరుకుని గల్లంతైన వారికోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story