ట్వీట్‌కు రిప్లయ్ ఇవ్వాలంటే ? కండిషన్స్ అప్లయ్!

by Anukaran |   ( Updated:2020-08-12 08:01:19.0  )
ట్వీట్‌కు రిప్లయ్ ఇవ్వాలంటే ? కండిషన్స్ అప్లయ్!
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. తమ యూజర్లకు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు నెలల టెస్టింగ్ అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ ‘లిమిటెడ్ రిప్లై’ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ వల్ల ఇకపై ఓ ట్వీట్ చేసే ముందు.. ఆ ట్వీట్‌కు ఎవరు రిప్లయ్ ఇవ్వాలో కూడా డిసైడ్ చేసుకోవచ్చు.

మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్.. ట్విట్టర్‌లో ఓ చిన్న ట్వీటే చేస్తుంటారు కానీ, అవి ఎన్నో వివాదాలకు దారి తీస్తాయి. పైగా మన ట్వీట్స్‌కు సంబంధం లేని వాళ్లు కూడా రెస్పాండ్ అవుతుంటారు. అయితే, ఇకపై అలాంటి అవకాశం లేదు. ట్వీట్ చేసే ముందు దానికి రిప్లయ్ అందరూ ఇవ్వాలా? లేక మనల్ని ఫాలో అయ్యేవాళ్లే ఇవ్వాలా? లేదా మనం మెన్షన్ చేసిన పీపుల్ మాత్రమే ఇవ్వాలా అనేది ఇకమీదట మనమే డిసైడ్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓస్ యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఎలా చూజ్ చేసుకోవాలంటే..

1. ట్విట్టర్. కామ్ లేదా ట్విట్టర్ యాప్‌లో.. కంపోజ్ ట్వీట్ బటన్ మీద ట్యాప్ చేయాలి.
2. గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేసి.. ఎవరు ట్వీట్‌కు రిప్లయ్ ఇవ్వాలో ఎంచుకోవాలి.
3. ‘ఎవ్రీ వన్’, ‘పీపుల్ యూ ఫాలో’ ‘ఓన్లీ పీపుల్ యూ మెన్షన్’ అనే దాంట్లో ఒక దాన్ని పిక్ చేసుకోవాలి.
4. ఒకసారి సెట్టింగ్స్ ఫైనల్ చేసుకున్న తర్వాత ట్వీట్ కంపోజ్ చేసి.. పోస్ట్ చేయాలి.

Advertisement

Next Story

Most Viewed