నా భర్తను చూసి గర్వపడుతున్నా : ట్వింకిల్ ఖన్నా

by Shyam |
నా భర్తను చూసి గర్వపడుతున్నా : ట్వింకిల్ ఖన్నా
X

దిశ, వెబ్‌డెస్క్: అక్షయ్ కుమార్… బాలీవుడ్ రియల్ హీరో. అసలు ఎలాంటి సంకోచం లేకుండా రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. తన సేవింగ్స్ నుంచి అంత పెద్ద మొత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్స్‌కు అందిస్తూ ప్రకటన చేసి మనసున్న మారాజు అనిపించుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా కాటేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ.. ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందించిన మొదటి కథానాయకుడు కూడా అక్షయ్ కావడం గమనార్హం.

ఈ విషయంపైనే స్పందించారు అక్షయ్ భార్య హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా. నా భర్తను చూస్తే గర్వంగా ఉందని తెలిపిన ట్వింకిల్ …. అంత భారీ విరాళం ఇస్తే మనకేలా అని ప్రశ్నించిందటా. దానికి అక్షయ్… నేను కెరియర్ ప్రారంభించే ముందు తన దగ్గర ఏమీ లేవని.. కానీ ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నానని తెలిపాడట. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఏమీ లేని వారికి సహాయం చేయడానికి ఎలా వెనుకడుగు వేస్తానని సమాధానమిచ్చాడట.

Tags : Twinkle Khanna, Akshay Kumar, Bollywood, CoronaVirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed